ఏ సేవ అయినా సరే... ఆన్ లైన్ బుకింగ్ కోసం 26,063 శ్రీవారి సేవా టికెట్ల విడుదల
తిరుమల వెంకన్నకు ఏదైనా సేవ చేయాలని భావిస్తున్నారా? సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణలతో పాటు విశేషపూజ, నిజపాద దర్శనం తదితర అన్ని సేవలకూ సంబంధించి జనవరి 1 నుంచి 31 వరకూ మొత్తం 26,063 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. వీటి అమ్మకాలు ఈ ఉదయం 11 గంటల నుంచి జరుగనున్నాయి. కాగా, భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, దళారులను నివారించవచ్చని భావిస్తూ, టీటీడీ నెలకోసారి గంపగుత్తగా టికెట్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.